చీరాల, సెప్టెంబర్ 26 : చీరాల పురపాలక సంఘం పరిధిలో నూతనంగా ఏర్పడిన 44 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చీరాల పురపాలక సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారి, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 1 నుంచి 44 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, తప్పులు ఉండటం, వార్డు మార్పులు తదితర అభ్యంతరాలను ప్రజలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 28, 2026లోగా సంబంధిత కార్యాలయంలో తమ అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఓటర్ల జాబితాను పరిశీలించి, తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు.

