Homeఆంధ్రప్రదేశ్బాపట్లకుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయం అందించిన గుండ్రెడ్డి శివ

కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయం అందించిన గుండ్రెడ్డి శివ

బాపట్ల, సెప్టెంబర్27 : ఆపదలో ఉన్నవారికి “నేనున్నానంటూ” అండగా నిలిచే దాతృత్వ హృదయుడు గుండ్రెడ్డి శివ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇటీవల చెరువు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ మరియు ఆమె కుమారుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి (కరెంట్ షాక్) గురై అక్కడికక్కడే మృతి చెందిన సంగతి విదితమే. ఈ దారుణ ఘటన గురించి తన అనుచరుల ద్వారా తెలుసుకున్న శివ తీవ్రంగా చలించిపోయారు. సమాచారం అందుకున్న మరుక్షణమే బాధిత కుటుంబం వద్దకు చేరుకుని వారిని పరామర్శించి, ఓదార్చారు. ఈ కష్ట సమయంలో వారికి తన వంతు బాధ్యతగా ₹50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు చింతా కిషోర్ కుమార్, వుసా రాంబాబు, అలాగే బాపట్ల బ్రదర్స్ తరఫున భాస్కర రాజు, JD ప్రసాద్, రాధాకృష్ణ, రమేష్, చాన్ రెడ్డి, దీపక్, నవీన్ మరియు పలువురు ముఖ్య నాయకులు, అనుచరులు పాల్గొన్నారు. గుండ్రెడ్డి శివ చేసిన ఈ తక్షణ సాయం పట్ల స్థానిక ప్రజలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular