Homeఆంధ్రప్రదేశ్బాపట్లనులిపురుగుల నిర్మూలనలో భాగంగా 6,857 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు

నులిపురుగుల నిర్మూలనలో భాగంగా 6,857 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు

వేటపాలెం, సెప్టెంబర్ 25 :  జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలో మొత్తం 7,182 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాల్సి ఉండగా, 6,857 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారిణి డాక్టర్ టి. ప్రియాంక తెలిపారు. వివిధ కారణాలతో మాత్రలు తీసుకోలేకపోయిన మిగిలిన 325 మంది పిల్లలకు అక్టోబర్ 5వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తామని వెల్లడించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత వైద్య సిబ్బంది, విద్యాసంస్థల నిర్వాహకులు సహకరించాలని డాక్టర్ ప్రియాంక కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular