Homeఆంధ్రప్రదేశ్బాపట్లయువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

చీరాల, సెప్టెంబర్ 25 :  మేరా యువ భారత్–గుంటూరు ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం చీరాల సెయింట్ మార్క్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్డ్స్ ఎన్జీఓ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించి, యువత దేశ నిర్మాణంలో బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారపాటి పుష్ప రాజు, కార్డ్స్ ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, జి. మంజులాదేవి, వి. విజయశీలారాణి, పి. చిన్నప్ప, ఎన్. సుమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular