Homeఆంధ్రప్రదేశ్కాకినాడపి.ఆర్ .కళాశాలలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం

పి.ఆర్ .కళాశాలలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం

కాకినాడ, పెన్‌పవర్‌, నవంబర్ 9: స్థానిక పీ.ఆర్. ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ వీఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ ఎస్‌కే షిరీన్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే ర్యాగింగ్ నిరోధక చట్టంతో పాటు వివిధ చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.కె. మెహర్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినవారు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. న్యాయ సేవా కమిటీ సభ్యులు పి. సునీల్ కాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన భవిష్యత్తులో సురక్షితమైన, సజావైన జీవితానికి దోహద పడుతుందని పేర్కొన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని న్యాయ సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు యేసుబాబు,వసంతలక్ష్మి, కళాశాల ఐక్యూఏసీ ప్రతినిధి డాక్టర్ హరిరామ్ ప్రసాద్, డాక్టర్ పి.డి. రమణ, డాక్టర్ పాండురంగారావు,కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ప్రతిమ,సంస్కృత విభాగాధిపతి డాక్టర్ వై.బుజ్జి, డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మణరావు,కెప్టెన్ డాక్టర్ ఎం. కృష్ణారావు,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular