Homeఆంధ్రప్రదేశ్పెదవలసలో టీడీపీ అభ్యర్థి కుమారి తరఫున కూటమి నేతల ప్రచారం

పెదవలసలో టీడీపీ అభ్యర్థి కుమారి తరఫున కూటమి నేతల ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 31:పెదవలస టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సప్పగెడ్డ కుమారి తరఫున కూటమి నాయకులు పెదవలస పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనంద్, కూటమి నాయకుడు దొరబాబుతో పాటు ఇతర నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని అభ్యర్థి కుమారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా సప్పగెడ్డ కుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూటమి నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular