గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్31:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల పరిధిలోని పెదవలస పంచాయతీ రాంపుల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి లంబసింగి సింహాచలం కుమారి ఆమె భర్త రమేష్ గ్రామంలో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువతను కలిసి తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పెదవలస పంచాయతీలో వైసీపీ ప్రచారం జోరు
RELATED ARTICLES

