Homeఆంధ్రప్రదేశ్పోలవరందేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత**

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత**

 

**రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ఘనంగా రన్ ఫర్ యూనిటీ**

**జాతీయ సమైక్యత పరుగు ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ కె. చక్రవర్తి**

**రంపచోడవరం, (పోలవరం బ్యూరో) పెన్ పవర్ అక్టోబర్ 31 :** సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యత దినోత్సవం) మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలవరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రంపచోడవరంలో జాతీయ సమైక్యత పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశంలోని వివిధ సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతదేశ ఐక్యత, సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అసాధారణ కృషి, దూరదృష్టి కారణంగానే దేశం ఐక్యంగా నిలబడగలిగిందని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రజలందరిలో పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అంతర్గత భద్రతను కాపాడటంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, జాతీయ సమైక్యతా భావాన్ని తమ జీవితాల్లో భాగంగా చేసుకోవాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా దేశభక్తి, జాతీయ సమైక్యత, ఐకమత్యం వంటి విలువలను ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెంపొందించేందుకు పోలీస్ శాఖ కృషి చేసింది. ఈ సందర్భంగా విజేతలైన వారికి కలెక్టర్ ఎస్పీ బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో  సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్, ఓఎస్డీ (అడ్మిన్) జావలి ఆల్ఫోన్స్, డీఎస్పీ అస్రప్ అలీ, చింతూరు డీఎస్పీ ఉదయపావని, ఏఆర్ డీఎస్పీ సీతారాం, ఎస్‌బీ సీఐ భాను ప్రసాద్, ఏఆర్ ఆర్‌ఐ వరప్రసాద్ బాబు, రంపచోడవరం సీఐ నరేంద్ర ప్రసాద్, ఎస్‌ఐ రమేష్, ఈగల్ టీమ్, ఏఎన్‌ఎస్ టీమ్ సభ్యులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, యువతతో పాటు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular