Homeఆంధ్రప్రదేశ్బాపట్లసొంత నిధులతో వాటర్ ట్యాంకు ఏర్పాటు, ఆలయానికి మరమ్మతులు

సొంత నిధులతో వాటర్ ట్యాంకు ఏర్పాటు, ఆలయానికి మరమ్మతులు

కొత్త యానాది కాలనీలో కటారి శ్రీను సేవా కార్యక్రమాలు

వేటపాలెం, అక్టోబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక వసతుల కల్పనకు తనవంతు సహకారం అందించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కటారి వారి పాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కటారి శ్రీను తెలిపారు.

వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త యానాది కాలనీలో సుమారు రూ.లక్ష సొంత నిధులతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయించడంతో పాటు, స్థానిక తిరుపతమ్మ గుడికి మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమానికి చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ గ్రామ అధ్యక్షుడు కీర్తి పూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కటారి శ్రీను మాట్లాడుతూ పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వ సారథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో ప్రజోపయోగ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు ఆలయాల అభివృద్ధి, ఇతర ప్రజావసరాల కల్పనకు ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రజల అవసరాలకు స్పందించి చేతనైన సహాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ముఖ్య అతిథి కీర్తి పూర్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయించడం, తిరుపతమ్మ గుడికి మరమ్మతులు చేయించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కటారి సమాధి, గ్రామ పెద్ద ఆంజనేయులు, శ్రీరామమూర్తి, పోలయ్య, కటారి శ్రీనివాసులు, కటారి పొట్టియ్య, వాయిల రాంబాబు, పొన్నపూడి ఈశ్వరయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular