బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జూపల్లి అరుణ్ కుమార్
కాప్రా, పెన్ పవర్ నవంబర్ 19:
భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జూపల్లి అరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, విస్తరణకు అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలని నియామక పత్రంలో సూచించారు.
ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, యువతను సంఘటితం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన జూపల్లి అరుణ్ కుమార్‌కు తన మిత్రులు, కాలనీవాసులు, పలువురు బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

