ePaper
Monday, May 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడగ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి

గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి

📰 Generate e-Paper Clip

కందులపాలెంలో రూ.30 లక్షలతో కల్వర్టుకు శంకుస్థాపన

రామచంద్రపురం, పెన్ పవర్,మే 4:
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నదని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు సోమవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్య మవుతుందని తెలిపారు. రహదారులు, కాల్వలు, కల్వర్టులు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజలకు రవాణా సౌకర్యం సులభమవుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, వ్యవసాయ కార్యకలాపాలు, రవాణా సౌకర్యాలు మరింత సులభతరం అవుతాయని వివరించారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారిని పద్మజ్యోతి, డీఈ శ్రీనివాస్, ఏఈ ఏసురత్నం, కందులపాలెం ప్రత్యేక అధికారి మణిదీప్, పిఎసిఎస్ చైర్మన్ వయిట్ల రాజబాబు, వయిట్ల గజలక్ష్మి, గీసాల శివ, కూటమి పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular