ePaper
Tuesday, May 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడకిడ్నాప్ కేసులో ముద్దాయికి 3 ఏళ్ల జైలు శిక్ష

కిడ్నాప్ కేసులో ముద్దాయికి 3 ఏళ్ల జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

కాకినాడ, పెన్ పవర్,మే4:
సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. 2020లో నమోదైన ఈ కేసులో నిందితుడు కాకరపల్లి లక్ష్మి వర ప్రసాద్ (29), రాయుడుపాలెం, రమణయ్యపేట పంచాయతీ, కాకినాడ రూరల్‌కు చెందినవాడు.కేసు వివరాల ప్రకారం, మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా, సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సై కృష్ణబాబు కేసు నమోదు చేయగా, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎలియా సాగర్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.విచారణ అనంతరం కాకినాడ పోక్సో కోర్టు గౌరవ న్యాయమూర్తి కె. శ్రీదేవి నిందితుడిని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంకే శ్రీదేవి బలమైన వాదనలు వినిపించారు.ఈ కేసులో శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను,కోర్ట్ కానిస్టేబుల్ కడలి సతీష్‌ను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular