ePaper
Tuesday, May 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిలబ్ధిదారులు రాకపోవడంతో విజయోత్సవాలు రద్దు

లబ్ధిదారులు రాకపోవడంతో విజయోత్సవాలు రద్దు

📰 Generate e-Paper Clip

కంబాల శ్రీనివాసరావు ఆవేదన:

కోరుకొండ, పెన్ పవర్, మే 4:

రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల సందర్భంగా కోరుకొండలోని రామసేన ఆఫీసు వద్ద కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరూ హాజరు కాలేదు. తన సేవలు పొందిన వారు ఎవరూ రాకపోవడంతో కంబాల శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపం చెందారు. “నేను కేవలం దానం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. నా వద్ద సహాయం పొందిన వారు నేను చేసే సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోకపోతే నేను చేసిన దానాలకు అర్థం ఏముంది?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

పార్టీ కోసం తాను ఎంతో దానధర్మాలు చేస్తుంటే, తనకు అండగా ఉండాల్సిన వారే వెన్నుపోటు పొడుస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ చివరికి విజయోత్సవానికి సంబంధించిన కేకు కూడా కట్ చేయకుండా ఆయన నిలిపివేశారు.ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి మీడియాని ఆహ్వానించారు కానీ కార్యక్రమం ఆగిందని చెప్పకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఇదే ద్వారని కొనసాగితే రాజకీయంగా ఎదగడం కొంచెం కష్టంగానే ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular