ePaper
Sunday, May 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చిలకలూరిపేట పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

చిలకలూరిపేట పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 08:  

చిలకలూరిపేట: 2019లో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. తన పెంపుడు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయపూడి మరియదాసు (రాజు)కు జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి షమ్మీ సుల్తానా పర్వీన్ తీర్పు వెలువరించారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అమలవుతున్న ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాటి ఎస్సై బి. శివరామయ్య కేసు నమోదు చేయగా, సీఐలు వి.సూర్యనారాయణ, టి. వెంకటేశ్వర్లు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుత డీఎస్పీ ఎం. హనుమంతరావు, సీఐ రమేష్‌ల పర్యవేక్షణలో పోలీసులు పక్కా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. దుర్గా ప్రసాద్ తన వాదనలతో నిందితుడికి శిక్ష పడటంలో ముఖ్య భూమిక పోషించారు. బాధితురాలికి న్యాయం చేకూర్చిన పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular