ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు

నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మున్సిపాలిటీలోని ఒకటి, రెండవ వార్డుల టిడిపి ఇన్చార్జ్ లాలం మురళీకృష్ణ తన సొంత నిధులతో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ వార్డు మెంబర్, స్వర్గీయ లాలం సూరిబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చింతకాయల రాజేష్ మరియు డి.ఎస్.పి పి. శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విగ్రహ ఆవిష్కరణ అనంతరం లాలం మురళి మాట్లాడుతూ ఈ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చింతకాయల రాజేష్ మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి గౌతమ బుద్ధుని విగ్రహం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందన్నారు. పోలీస్ గ్రౌండ్ ను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ షేక్ గఫూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, అనకాపల్లి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి లాలం శ్రీరంగ స్వామి, రుత్తల రాజేశ్వరరావు, రుత్తల కృష్ణ, డబ్బీరు శ్రీకాంత్, గొలుసు నరసింహమూర్తి, రుత్తల చిన్న, టిడిపి కార్యకర్తలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular