ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిపెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్:

​పెదబొడ్డేపల్లి చెరువు అభివృద్ధిలో భాగంగా పంట కాలువ పూడికతీత, చెరువుగట్టుపై జంగిల్ క్లియరెన్స్, రెండు గేట్ల ఏర్పాటు పనులను రూ. 6.5 లక్షల నిధులతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని జలవనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్డీఓ బంగ్లా ముందు కల్వర్టు పనులు అవుతున్నాయని అదేవిధంగా జోగినాథపాలెంలో కల్వర్ట్ పనులను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. రూ. 1 కోటి 40 లక్షల వ్యయంతో ఇక్కడ అధునాతన వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని ఒక సుందరమైన పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని, అందరి సహకారంతో ఈ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో పెదబొడ్డేపల్లి చెరువు నీటి సంఘం చైర్మన్ రుత్తల రామసత్యం, వైస్ చైర్మన్ గుడివాడ అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వార్డు కౌన్సిలర్ గుడివాడ రాజులునాయుడు, సత్తిబాబు, రెడ్డి అప్పలనాయుడు, రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కృష్ణ మరియు స్థానిక రైతులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular