మండల వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరిన పింఛన్లు
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరింపు
కాజులూరు, జూన్ 1 (పెన్ పవర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సోమవారం కాజులూరు మండల వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గొల్లపాలెం, శలపాక, బంధనపూడి, ఆర్యావటం తదితర గ్రామాల్లో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు.
ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల గడప వద్దకే పింఛన్లు అందజేస్తుండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన పింఛన్ మొత్తం తమకు ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తోందని లబ్ధిదారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బంధనపూడి గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ సలాది పుష్ప మాట్లాడుతూ, సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని తెలిపారు.ఆర్యావటం గ్రామంలో సొసైటీ అధ్యక్షులు కోట తాతబ్బాయి, టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి హనుమంతు చౌదరి, గ్రామ కమిటీ అధ్యక్షులు కురుపూడి దొరబాబు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గొల్లపాలెం గ్రామంలో సొసైటీ అధ్యక్షులు అంగర కృష్ణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి హనుమంతు చౌదరి మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఎన్టీఆర్ భరోసా పథకం ప్రధాన లక్ష్యమన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పింఛన్ల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.శలపాక గ్రామంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొనగా, లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

