ePaper
Monday, June 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅక్రమ ఠాణాల వసూళ్లు

అక్రమ ఠాణాల వసూళ్లు

📰 Generate e-Paper Clip

 

హడలి పోతున్న వాహనదారులు

వై రామవరం, పెన్ పవర్, మే 31: రహదారి పొడవున అక్రమఠాణా ల వసూళ్లతో వాహనదారులుహడలి పోతున్న సంఘటనలు ఇవి.
పండగ ఏదైనా గ్రామాల సరిహద్దులలో ఠాణా లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపి చేసి చందాలు వసూలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో రహదారి ప్రక్కన ఉన్న గ్రామాలకే ఇటువంటి సంప్రదాయం ఉండేదని, ప్రస్తుతం రహదారికి లోపల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు చందాల వసూళ్ల కోసం రహదారి పొడవునా ఠాణాలు ఏర్పాటు చేసి చందాలు వసూలు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పడేటట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ దేవత గంగాలమ్మ పండుగలు జరుగుతున్నాయని తెలిపారు. ఆది,సోమ, మంగళవారాలు వచ్చాయంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారని పలువురు వాపోతున్నారు. వై.రామవరం నుండి అడ్డతీగల వెళ్లాలంటే ఈ పై మూడు రోజులలో సుమారుగా 20 ఠాణాలు ఉంటున్నాయని వాహనదారులు తెలిపారు. ఒక్కొక్క దగ్గర పది రూపాయలు ఇచ్చిన ఒక వాహన దారునకు 200 రూపాయలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఠాణా లను నిరోధించవలసిన ఆవశ్యకత సంబంధిత అధికారులపై ఉందని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular