కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత?
వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతపై ఆందోళన
విశాఖ, పెన్ పవర్,జూన్ 11 :
“విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు వరుస ప్రమాదాలతో విషాదానికి కేంద్రంగా మారుతోంది. ఎంతో పరిజ్ఞానం, అనుభవంతో నిర్మించిన ఈ కర్మాగారంలో భద్రతా లోపాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపో తున్నాయని కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్ఎంఎస్-2 ప్రారంభ సమయంలో జరిగిన ప్రమాదాల నుంచి ఇటీవల జరిగిన ప్రమాదాల వరకు అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 8 సోమవారం సాయంత్రం విధులు ముగించే సమయంలో హాట్ మెటల్ ప్రమాదం పలువురు ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన నుంచి తేరు కోకముందే గురువారం ఉదయం మరో భారీ ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల చివరి మాటలు కుటుంబాలను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. “అమ్మను బాగా చూ సుకో.. తమ్ముడిని బాగా చదివించు.. ఇంటికి పెద్దవాడిగా నీవే బాధ్యత తీసుకో” అంటూ ఓ కార్మికుడు తన కుమారుడికి చెప్పిన చివరి మా టలు హృదయాలను కలిచివేస్తున్నాయి. మరో కార్మికుడు “స్టీల్ ప్లాంట్‌ను కాపాడం డి” అంటూ చివరి శ్వాసలో చెప్పిన మాటలు మరువలేని విగా మిగిలిపోయాయి.ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ పరిహారం, ఉద్యోగాల హామీలతో సమ స్య ముగిసిపోదని కార్మిక సంఘాలు, కుటుం బాలు అంటున్నాయి. పాత యంత్రాల మార్పిడి, ఆధునిక భద్రతా పరికరాల వినియోగం, సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా యి.స్టీల్ ప్లాంట్‌లో పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు తిరిగి క్షేమంగా వస్తారో లేదో అనే భ యంతో కార్మికుల కుటుంబాలు రోజులు గడు పుతున్నాయి. “ప్రాణ భద్రత కల్పించండి” అం టూ వారి ఆవేదన కన్నీటి రూపంలో బయటపడుతోంది.
