కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు
వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ నూతన కార్యవర్గం ఎన్నిక
నర్సీపట్నం, పెన్ పవర్ (జూన్ 15 ) :
నర్సీపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా మండలి ఆవరణలో సోమవారం వి.ఎస్.ఎస్.ఎస్ నెట్‌వర్క్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్‌వైడీఎస్ సంస్థ కార్యదర్శి ఎస్. నూకరాజు అధ్యక్షత వహించారు. నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం, స్వచ్ఛంద సేవా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి అంశాలపై సభ్యులతో చర్చలు జరిపారు. సమావేశంలో నెట్‌వర్క్ కార్యదర్శి జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు మాట్లాడుతూ సంస్థ చేపట్టిన పలు సర్వేలు, వాటి ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల విస్తరణకు నెట్‌వర్క్ కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేస్తే సమాజంలో మరింత ప్రభావవంతమైన మార్పులు తీసుకురాగలమని పేర్కొన్నారు. అనంతరం 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్. నూకరాజు (రాంబిల్లి), ఉపాధ్యక్షుడిగా రవికుమార్ (శ్రీకాకుళం), కార్యదర్శిగా జి.టి.వి.ఎస్.ఆర్.కె. రాజు (నర్సీపట్నం), ఉప కార్యదర్శిగా బాలరాజు (తూర్పుగోదావరి జిల్లా), కోశాధికారిగా గెడ్డం విజయలక్ష్మి (గింజర్తి) ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా వరలక్ష్మి (గబ్బాడ), ఎన్. లోవమణి (మల్లంపేట), చిన్నారావు (అమలాపురం), దుర్గారావు (రాంబిల్లి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థకు మార్గదర్శకత్వం అందించే అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఆర్. జగ్గారావు (నాతవరం), కొణతాల కృష్ణ (అనకాపల్లి), ప్రసాద్ (నర్సీపట్నం), ఎం. చిట్టిబాబు (అల్లూరి జిల్లా), నాగరాజు (పెందుర్తి)లను నియమించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెట్‌వర్క్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జి. శ్రీనివాస్ వందన సమర్పణ చేయగా, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

