Homeఆంధ్రప్రదేశ్ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

అమరావతి, జూన్ 24 (పెన్ పవర్): రాష్ట్రంలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. కార్యక్రమం విజయవంతం కోసం రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1.31 లక్షల మందికిపైగా సిబ్బందిని సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular