Homeఆంధ్రప్రదేశ్పోలవరంపల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్

📰 Generate e-Paper Clip

 

రంపచోడవరం, జూన్ 28: పోలవరం జిల్లాను పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం రంపచోడవరం సచివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.

జిల్లాలో 651 పోలియో బూత్‌లు, 47 మొబైల్ టీమ్‌లు, 22 ప్రత్యేక మొబైల్ టీమ్‌ల ద్వారా 0-5 సంవత్సరాల లోపు 28,265 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. సరిత, ఐసీడీఎస్ పీడీ కె. ఉమా, వైద్యాధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular