కాజులూరు, పెన్ పవర్, జూన్ 30: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో డెడ్‌లిఫ్ట్ విభాగంలో గొల్లపాలెం ఐరన్ ఫిట్‌నెస్ జిమ్‌లో శిక్షణ పొందుతున్న కె.డి.ఎస్. కుమార్ కాంస్య పతకం సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా మంగళవారం జిమ్ ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభలో డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షురాలు, బందనపూడి మాజీ సర్పంచ్ డేగల తిరుమలవేణి విజేతను ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా డేగల తిరుమలవేణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు.శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొన్నారు.క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ,నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో కీలకమని అన్నారు.గ్రామీణ యువతకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా గొల్లపాలెంలో ఐరన్ ఫిట్‌నెస్ జిమ్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకుడు మేడిశెట్టి జగన్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.రిటైర్డ్ ఆర్మీ అధికారి మేడిశెట్టి రామకృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఇటువంటి జిమ్‌లు ఎంతో దోహదపడతాయని అన్నారు. విజేత కె.డి.ఎస్.కుమార్‌ను మేడిశెట్టి రాంబాబు, తాడి వాసురెడ్డి,పోతురాజు బాబురావు,జగతా నాగబాబు,జిమ్ కోచ్‌లు షారుణ్,బాలసాయి శరన్, మహేష్,మాత కృష్ణ తదితరులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

