గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15:
గార్ల మండల కేంద్రంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాలయ కరస్పాండెంట్, సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, బీరవెల్లి సంజీవరెడ్డి,లు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతంత్ర్య వేడుకలను ప్రారంభించారు. ప్రిన్సిపల్ పసుపులేటి రమేష్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యాలయంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి, ఉన్నత వైద్య చదువులను పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణంలోని ఇండస్ ఆసుపత్రిలో ఎమ్మెస్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రోబోటిక్ సర్జన్ వైద్య వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్న డాక్టర్ చాగంటి రాకేష్ విద్యార్థులు చదువులను గొప్పగా రాణించుటకు ప్రత్యేక ప్రోత్సాహకంగా నగదు, మెమొంట్లను ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. అందులో భాగంగా గత సంవత్సరం 10వ తరగతి లో మండల ప్రథమం జిల్లా మేఘన, ద్వితీయం తోకల ప్రీతిక, తృతీయంగా ఇస్లావత్ శ్రీ చరిత్, లకు పాఠశాల కరస్పాండెంట్,లు ప్రిన్సిపాల్ తో కలిసి అందజేశారు. వారు మాట్లాడుతూ భవిష్యత్తులో క్రమశిక్షణతో చదివి అత్యుత్తమ మార్కులు సాధించి విద్యాలయం కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన జాతీయ నాయకుల వేషధారణలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

