మండలం 18 గ్రామ పంచాయతీల నందు VB-G RAM G అంటే వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్). గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, జీవనోపాధి భద్రతను పటిష్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పాత ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని (VB-G RAM G Act, 2025) తీసుకువచ్చింది.ఈ కార్యక్రమములో భాగముగా ఈ రోజు 18 గ్రామ పంచాయతీల నందు ఆయా పంచాయతీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు , స్థానిక గ్రామ పెద్దలు మరియు వేతన దారులు,పంచాయతీ ప్రత్యెక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు వారి సిబ్బంది , VB-G RAM G సిబ్బంది, మండల పరిషత్ అభివృద్ధి అధికారివారు ఆయా గ్రామాలలో హాజరు అయి పనులు ప్రారంబించినారు. మరియు ఈ రోజు తిరుపతిలో రాష్ట్రవ్యాప్త కార్య క్రమమును నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి,రాష్ట్ర ముఖ్య మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వారి ఆధ్వర్యములో నిర్వహించబడిన లైవ్ టెలికాస్ట్ ను పంచాయతీ కార్యాలయాలలో మరియు రైతుసేవా కేంద్రలాలో జన సమూహాలతో ప్రదర్శించబడినది.

