సర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి: గంటా శ్రీనివాస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 03 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, ప్రతి బూత్‌లో లక్ష్యాలను పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో భీమిలి నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 361 బూత్‌లలో వెనుకబడిన బూత్ లెవల్ ఏజెంట్లను చైతన్యపరచాలని, ఎస్ఐఆర్ గడువు పొడిగింపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున రాబోయే పది రోజుల పాటు పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌పైనే దృష్టి సారించాలని ఆదేశించారు. భీమిలి నియోజకవర్గం నుంచి 92 వేల మెజారిటీ, లక్ష సభ్యత్వాల నమోదు వంటి లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయడంతో పార్టీ అధిష్ఠానానికి నియోజకవర్గంపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయని గంటా పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కోరారు.
2వ వార్డులో కేవలం 24 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని ప్రస్తావిస్తూ, ఆశించిన స్థాయిలో పనిచేయని బూత్ లెవల్ ఏజెంట్లను మార్చాలని మాజీ కార్పొరేటర్ చిన్ని కుమారికి సూచించారు. భీమిలి మండలంలోని మత్స్యకార గ్రామాల ప్రజల్లో కొంతమందికి భీమిలితో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా ఓటు హక్కు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని భీమిలి మండల పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ముచ్చర్ల, శిర్లపాలెం తదితర గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ మందగిస్తున్నట్లు ఆనందపురం మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు తెలిపారు. బూత్ స్థాయిలో జరుగుతున్న పనితీరును ప్రతిరోజూ తానే స్వయంగా సమీక్షిస్తానని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్‌బాబు, గాడు వెంకటప్పడు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, మీసాల సత్యనారాయణ, గంటా నూకరాజు, పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, పీవీ నరసింహం, గొలగాని నరేంద్ర, పంచదార్ల శ్రీనివాస్, చెట్టుపల్లి సన్యాసిరావు, నాగోతి సత్యనారాయణ, లొడగల వెంకట్రావు, గరే గురునాథ్, కానూరు అచ్యుతరావు, లొడగల జానకిరాం, గాడు తాతినాయుడు తదితరులు పాల్గొన్నారు.

