Homeఎడిటోరియల్స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి

స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి

గార్ల, పెన్ పవర్, జూలై 21:

ఎల్ నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు సూచించారు.గార్ల మండలం పరిధిలోని బుద్దారం గ్రామ పంచాయతీ కార్యాలయం లో మంగళవారం సర్పంచ్ బానోత్ రమేష్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రామారావు మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితి వలన వర్షబావ పరిస్థితులు ఏర్పడ్డయని అందుకు అనుగుణంగా రైతులు తక్కువ నీటి వినియోగం తో స్వల్ప కాలిక పంటలు సాగు చేయాలని వరి మాగాణులలో నీటి పరిమాణం తక్కువగా వున్నప్పుడు పెసర మినుములు కూరగాయలు చిరుదాన్యాలు సాగు చేయాలని ప్రస్తుతం రైతు వేదిక వద్ద ఎం జి జి 385 పెసర రకం విత్తనాలు రాయితీ పై అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించు కోవాలని ఈ రకం పెసర అన్ని కాలాలకు అనువుగా ఉంటుందని పల్లాకు తెగులును తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని పంటల సాగు లో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సలహాలను పాటిస్తూ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు అవలంభించాలని రైతులను కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా ఆత్మనిర్భరత ప్రోగ్రాం లో రాయితీ పై ఇచ్చిన ఎం జి జి 385 రకం పెసర పంట ను క్షేత్ర స్థాయి లో రైతులతో కలిసి సందర్శించి పలు సూచనలు చేసారు.. ఈ కార్యక్రమం లో పశువైద్యాధికారి డాక్టర్ సురేష్ ఏఈఓ రాజ్యలక్ష్మి గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular