గార్ల, పెన్ పవర్, జులై 24:
వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకురెగ్యులర్ కమిషనర్ ను నియమించాలంటూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ సిబ్బంది ‘మొక్కలు నాటుదాం.. మనవి చేద్దాం’ పేరిట మొక్కలు నాటి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కమిషనర్ పదవీ విరమణ చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ రెగ్యులర్ కమిషనర్ ను నియమించక పోవడంతో ఆయా వైద్య శాలల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడడం తో పాటు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, మినిస్టీరియల్ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పేరుకుపోయిన తమ వ్యక్తిగత,సర్వీస్ పరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
ఈ విషయమై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతోఅత్యవసర వైద్య సేవలు అందించే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందున వీధుల్లోకొచ్చి ఉద్యమాలు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించలేక ఇటువంటి సున్నితమైన చర్యల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని,అనివార్యమైన పరిస్థితిలో మేము ఉద్యమాలు తీవ్రతరం చేయక ముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సీనియర్ వైద్యులు డాక్టర్ బాలు నాయక్, డాక్టర్ సతీష్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ నాగేశ్వరరావు, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ వి స్వాతి, మెర్సీ, ఝాన్సీ, రాణి, ఐ రాణి నర్సింగ్ ఆఫీసర్స్ ఉపేందర్, రజిని, స్వాతి వినీల, సరిత సీనియర్ అసిస్టెంట్ కిషోర్, పారామెడికల్ సిబ్బంది బైరపాక శ్రీనివాస్, అశోక్ నరసయ్య, దేవరాజు, ఉపేందర్ ఎల్లయ్య, ఉమాదేవి, కల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

