Homeతెలంగాణఫార్మర్‌ ఐడీ ఉంటేనే రైతు పథకాల ప్రయోజనాలు

ఫార్మర్‌ ఐడీ ఉంటేనే రైతు పథకాల ప్రయోజనాలు

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్: 13

రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలను మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్‌ ఐడీ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయ విస్తరణ అధికారి పూజిత అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని పోచారం రైతు వేదిక వద్ద రైతుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీలో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రైతులకు అందించే వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలను సులభంగా పొందేందుకు ఫార్మర్‌ ఐడీ కీలకంగా ఉంటుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలతో పాటు పీఎం కిసాన్‌ వంటి ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్‌ ఐడీ అవసరమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయానికి కూడా ఫార్మర్‌ ఐడీ ఉపయోగపడుతుందని తెలిపారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫార్మర్‌ రిజిస్ట్రీలో తమ వివరాలను నమోదు చేసుకుని ఫార్మర్‌ ఐడీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular