Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవిశాఖ సిటీ పోలీస్ శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాల పంపిణీ

విశాఖ సిటీ పోలీస్ శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాల పంపిణీ

విశాఖ సిటీ పోలీస్ శాఖలో పదోన్నతులు, కారుణ్య నియామక పత్రాల పంపిణీ

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్    విశాఖపట్నం, జులై 25 : విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి పదోన్నతులు లభించగా, వారికి నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బందిని అధికారులు అభినందించి, మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అదే విధంగా కారుణ్య నియామకాల కింద ముగ్గురు అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ నియామకాల ద్వారా బాధిత కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ మరో ముందడుగు వేసిందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన వారితో పాటు కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular