గార్ల, పెన్ పవర్, జులై 27:
మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మూడు రోజులుగా ఉపాధ్యా యులకు జరుగుతున్న వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన సందర్శించి, మాట్లాడారు ప్రతీ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారగలరని అన్నారు. బోధన నైపుణ్యాలు మెరుగుపడితే పఠన లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచన, సామర్థ్యాలు విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అవలంభించాలన్నారు. విద్యార్థులందరికీ వీలైనంత ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వీరభద్రరావు జడ్పీహెచ్ఎస్ ఎఫ్ఎసి హెచ్ఎం పద్మావతి సీఆర్పీలు నాగేశ్వరరావు బాలు తదితరులు ఉన్నారు.

