గార్ల, పెన్ పవర్, జులై 26:
ఈనెల 27 నుండి 29వ తారీకు వరకు రైతు వేదికలో నిర్వహించనున్న విత్తనమేళా ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వర్షాభావం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయడానికి అనుకూలమైన ఆరుతడి పంటల విత్తనాలు పెసర కంది మినుము రైతు వేదికలో రైతులకు అందుబాటులో ఉంచబడినవని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తనాలను పొందడంతో పాటు పంటలు ఎంపిక సాగు యాజమాన్యం వర్షాభావన పరిస్థితుల్లో అనుసరించాల్సిన శాస్త్రీయ సూచనలపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అవగాహన పొందాలని అన్నారు. ఈ విత్తన మేళ కార్యక్రమాన్ని రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

