పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జులై 30: జీవీఎంసీ 8వ వార్డు స్వర్ణభారతి నగర్లో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల 62.34 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,728 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఆయన, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టుపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, చెట్టుపల్లి గోపీ, లొడగల అప్పారావు, మంగాదేవి, లొడగల జానకిరాం తదితరులు పాల్గొన్నారు.

