Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంపోలీసుల తీరుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం

పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం

 

 

పైడి భీమవరంలో బొత్స వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం


బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం/శ్రీకాకుళం, జూలై 30 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని పైడి భీమవరం వద్ద పోలీసులు నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ అధికారిక కార్యక్రమంలో భాగంగానే తాము వెళ్తున్నామని పోలీసు అధికారులకు వివరించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుల పర్యటనలకు అనవసర ఆటంకాలు కల్పించడం, ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతిపక్ష నాయకుల పట్ల కక్షసాధింపు ధోరణి లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు తనిఖీలు పూర్తి చేయడంతో పోలీసులు వాహనాన్ని ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular