✒️
శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు తరలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిన సందర్భంగా విశాఖ విమానాశ్రయానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు 35వ వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లి జగన్‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై వాసుపల్లి గణేష్ కుమార్ స్పందిస్తూ, పోలీసుల దిగ్బంధనం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అబ్బిరెడ్డి ఆది విష్ణురెడ్డి, సౌత్ పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు జీరు సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రాము, వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి కె. గంగాధర్, వార్డు పార్టీ ఉపాధ్యక్షుడు గొరుసు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఈశ్వరరావు, పిల్లి కనకమ్మ, మహిళా అధ్యక్షురాలు పోలవరపు రమణమ్మ, సోషల్ మీడియా అధ్యక్షురాలు పట్నాన మీనా, బీసీ సెల్ అధ్యక్షుడు దేవరరాజు, బూత్ అధ్యక్షులు ముద్దాడ గణేష్, చెప్పా లక్ష్మణరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

