Homeఆంధ్రప్రదేశ్పోలవరంరాజస్థాన్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరి అరెస్ట్

చింతూరు, పెన్ పవర్ జూలై 30:

చింతూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చింతూరు ఎస్‌ఐ ఎం. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలు, అనుమానితులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన రాహుల్ సైన్ మరియు జై సింగల్ అనే ఇద్దరి వద్ద నుంచి సుమారు 6 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో మోతుగూడెం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అన్వేష్, వీఆర్వో, వీఆర్ఏతో పాటు చింతూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తామని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular