Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల

 

 

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను సంస్థ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

ఎయిర్ ఇండియా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24 వరకు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్–భోగాపురం మార్గంలో రోజుకు ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.

అలాగే బెంగళూరు–భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు నిర్వహించడంతో పాటు, ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మూడో సర్వీసును కూడా అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ పేర్కొంది.

విజయవాడ–భోగాపురం మార్గంలో రోజుకు నాలుగు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular