Homeఆంధ్రప్రదేశ్పోలవరంవర్షాన్ని లెక్కచేయకుండా ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

వర్షాన్ని లెక్కచేయకుండా ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

 

గంగవరం, పెన్ పవర్, ఆగస్టు 1:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంగవరం మండలంలో శనివారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ముచ్చకర్ల శివ ప్రసాద్ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పింఛన్లను ప్రతి అర్హులైన లబ్ధిదారుడికి సకాలంలో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వర్షంలోనూ విధులు నిర్వర్తించిన సచివాలయ సిబ్బంది సేవలను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular