గార్ల, పెన్ పవర్, ఆగస్టు 1:
విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ అన్నారు. ఖమ్మం శ్రీ సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందించిన 1000 పరీక్ష ఫ్యాడ్ లను గార్ల మండల పరిధిలోని వెంకటాపురం తండా తిర్లాపురం పూసల తండా గార్ల మర్రిగూడెం బంగ్లా తండా గోపాలపురం కే లోత్ తండా వేద నాయకపురం అంకన్నగూడెం ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు శనివారం టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ మండల అధ్యక్షులు వీరు నాయక్ లతో కలిసి ఆయన పంపిణీ చేసి మాట్లాడారువిద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థుల చదువుకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్న మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ సేవలు అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటయ్య ఉపాధ్యాయుడు భూక్య వీరన్న విద్యార్థులు పాల్గొన్నారు.

