Homeఎడిటోరియల్భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైఎస్. జగన్ విజన్‌కు నిదర్శనం...

భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైఎస్. జగన్ విజన్‌కు నిదర్శనం…

✒️

*భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైఎస్. జగన్ విజన్‌కు నిదర్శనం…

చంద్రబాబు చేస్తున్నది కేవలం క్రెడిట్ దోపిడీ మాత్రమే*

*భూములు సేకరించింది జగన్…

ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి ఘనత కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు –

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు*

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, ఆగష్టు 01 :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తికావడం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టి, సంకల్పం, పరిపాలనా సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనమని, అయితే దాని ఘనత మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసే రాజకీయాలకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం సుమారు 2,700 ఎకరాల భూమిని సేకరించింది ఎవరు?… రైతులకు పరిహారం చెల్లించి ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసింది ఎవరు?…. జీఎంఆర్ సంస్థకు అన్ని అనుమతులు, సహాయ సహకారాలు అందించి పనులు వేగవంతం చేసింది ఎవరు?… సమాధానం ఒక్కటే… అది వైఎస్. జగన్ ప్రభుత్వం.అని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన జరిగిన రోజే 2026 నాటికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతుందిఅని వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని, అదే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిందేమిటి?… సిద్ధమైన ప్రాజెక్టు వద్దకు వచ్చి రిబ్బన్ కట్ చేయడమే. కానీ ప్రచారం మాత్రం అన్నీ తామే చేసినట్లు చేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదు… ప్రజలను మభ్యపెట్టే రాజకీయ ప్రచారం.అని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వ ఘనతగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది వైఎస్. జగన్ వేశారు… భూములు సేకరించింది వైఎస్. జగన్ ప్రభుత్వం… ప్రాజెక్టుకు వేగం తీసుకొచ్చింది వైఎస్. జగన్ ప్రభుత్వం… కానీ చివరికి క్రెడిట్ మాత్రం చంద్రబాబు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు.అని కెకె రాజు పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఫోటోలు దిగడం కాదని, పునాది నుంచి ప్రాజెక్టును పూర్తి చేసే వరకు కష్టపడటమే నిజమైన నాయకత్వమని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు చరిత్రలో వైఎస్. జగన్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని, చంద్రబాబు చేస్తున్న క్రెడిట్ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నిజాలను దాచినా చరిత్ర మారదు… భోగాపురం ఎయిర్‌పోర్టు వైఎస్. జగన్ కృషి ఫలితమే. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది కేవలం క్రెడిట్ దోపిడీ మాత్రమే.అని కెకె రాజు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular