Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తికకు ఉత్తమ వాలంటీర్ అవార్డు

కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తికకు ఉత్తమ వాలంటీర్ అవార్డు

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 1:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన పాండు కరాటే అకాడమీ కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తికకు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో “ఉత్తమ వాలంటీర్” అవార్డు లభించింది.వైజాగ్ వాలంటీర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థలోని పునర్వినియోగం విభాగంలో దీప్తిక అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న దీప్తికను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ సెన్సై బాకూరు పాండు రాజు దీప్తికను అభినందించారు. కరాటే శిక్షణ కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదలతో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంపొందిస్తుందని ఆయన తెలిపారు.కరాటే ద్వారా నేర్చుకునే క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం జీవితంలోని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయని బాకూరు పాండు రాజు పేర్కొన్నారు. దీప్తిక సామాజిక సేవా రంగంలో మరిన్ని విజయాలు సాధించడంతో పాటు, కరాటే రంగంలోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.పాండు కరాటే అకాడమీ, ఇంటర్నేషనల్ కోఫుకాన్ కరాటే క్లబ్ ఇండియా సభ్యులు, శిక్షకులు దీప్తికకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular