Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంరక్తదానం.. ప్రాణదానంతో సమానం యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

రక్తదానం.. ప్రాణదానంతో సమానం యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

 

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి:

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

రామా టాకీస్ వద్ద వాయుపుత్ర హెల్త్ క్లబ్ లో 32వ రక్తదాన శిబిరం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 9: రక్తదానం చేయడం ఎంతో విలువైన సేవ అని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

రామా టాకీస్ వద్ద వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతను అభినందించి, వారికి సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. సమాజంలో రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో వరుసగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శివశంకర్, గణేష్, స్థానిక జనసేన వార్డు అధ్యక్షులు, చంటి, రాజు, సతీష్ తదితరులు, పలువురు ప్రముఖులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular