Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంషార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్

షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్

షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్

 

తప్పిన ప్రాణనష్టం.. కాలిబూడిదైన ఇంటి సామగ్రి

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        మధురవాడ, ఆగస్టు 10: పీఎం పాలెం రామాలయం సమీపంలోని ఆర్‌హెచ్ కాలనీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. కాలనీలోని ఓ రెండంతస్తుల భవనం పైభాగంలో ఉన్న చిన్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 

మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే బయటకు వచ్చారు. కొద్దిసేపటికే ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి.

 

అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పీఎం పాలెం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టంపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular