స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,ఆగష్టు 12:ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆగస్టు 11తో ముగియాల్సిన రిజిస్ట్రేషన్ గడువును ప్రభుత్వం పొడిగించినట్లు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు.ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన తాజా షెడ్యూల్‌ను త్వరలో కామన్ అడ్మిషన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో సవరణల కోసం విద్యార్థులు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. జానకిరావు సూచించారు. ప్రత్యేక కేటగిరీకి చెందిన విద్యార్థులకు సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాల్లో భౌతిక ధ్రువీకరణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

