గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఆగష్టు 10:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబును జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, పీసా కార్యదర్శి మాదిరి చంటిబాబు పరామర్శించారు.ఆదివారం కుక్క కాటుకు గురైన వంతల చంటిబాబు ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైద్యులు సూచించిన మందులను సక్రమంగా తీసుకోవాలని, తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాజీవనంలోకి రావాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పరస్పరం ఆప్యాయంగా మాట్లాడుకుని, ఆయనకు ధైర్యం చెప్పారు.
వైసీపీ నాయకుడు వంతల చంటిబాబును పరామర్శించిన జనసేన నాయకుడు గొర్లే వీర వెంకట్
RELATED ARTICLES

