Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

“వన్ మంత్ – వన్ కానిస్టెన్సీ – ఫోర్ విజిట్స్”తో ప్రజలకు చేరువగా పాలన

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్   విశాఖపట్నం, ఆగష్టు 14:ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, వాటికి వేగవంతమైన పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా “వన్ మంత్ – వన్ కానిస్టెన్సీ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.

పాత జైల్ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా వినతుల కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీఆర్వో, ఆర్డీఓ, ఎమ్మార్వో, జెడ్సీ మల్లయ్య నాయుడు తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. “వన్ మంత్ – వన్ కానిస్టెన్సీ – ఫోర్ విజిట్స్” ద్వారా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువగా పాలన అందించడం, సమస్యల పరిష్కారంలో వేగం పెంచడం, క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వ సేవలను అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రజా పాలనకు నాంది పలుకుతోందన్నారు.

కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు ఎస్.ఏ. రహమాన్, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాదిక్, ఏపీడీ పద్మ, స్థానిక జనసేన వార్డు అధ్యక్షురాలు రూప, టీడీపీ సీనియర్ నేత గాయత్రి, కూటమి నేతలు రాజేష్, గోపి, చందు, వార్డు కూటమి ఇన్‌చార్జ్, కేజీహెచ్ హెచ్‌డీఎస్ సభ్యులు డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం డిగ్రీ మహిళా కళాశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మొక్కలు నాటారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular