Homeఆంధ్రప్రదేశ్బాపట్లపారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వైద్య పరీక్షలు, సన్మానం

చీరాల, సెప్టెంబర్ 30 : చీరాల మండలం తోటవారిపాలెం స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో బుధవారం “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామ పారిశుద్ధ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను ఎవరూ తక్కువగా చూడరాదన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని, వారు లేకుంటే గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

కార్యక్రమంలో స్వర్ణ పంచాయతీ కార్యదర్శి మేడికొండ భారతి, జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల కోటేశ్వరరావు, పోసా హరిబాబు, స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular