గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15:
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గార్ల మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం నాయక్ ఉప సర్పంచ్ జరీనాతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తూ గ్రామ పరిశుభ్రత పారిశుధ్య పరిరక్షణలో కీలకంగా పని చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులను ఆమె అభినందించారు. సిబ్బంది సంక్షేమానికి తమ వంతుగా ప్రాధాన్యతతో పాటు వారి అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి సహకారం అందిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కి నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతుగా బాధ్యత వహించాలని ప్రకృతి పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించగలమన్నారు గ్రామపంచాయతీ ఆవరణంలో నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించాలని వాటికి అవసరమైన నీరు అందిస్తూ పెంచే బాధ్యతను సిబ్బంది తీసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించేందుకు ప్రజల సహకారం ఎంతగానో అవసరమన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం కేవలం జాతీయ పండుగగా నిర్వహించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మధు నాయుడు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సానిటేషన్ అధికారి పిడమర్తి దాసు వార్డు మెంబర్లు తోడేటి శ్రీనివాస్, సారయ్య, ఇమ్రా న్ రావుజి, పూర్ణచందర్, సాయి , తాళ్లపల్లి కృష్ణ గౌడ్, రాంబాబు, భారతి బేతి లక్ష్మి అజ్మీరా లక్ష్మి దీపిక నీలమ్మ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

