- గూడెం కొత్తవీధి, పెన్ పవర్,ఆగష్టు 15:స్వతంత్ర భారతావనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేన పార్టీ నాయకులు వీర వెంకట్ అన్నారు. శుక్రవారం గూడెం కొత్తవీధిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగమణి, నళిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర భారతావనిని పరిరక్షించుకోవాలి: జనసేన పార్టీ నాయకులు గొర్లే వీర వెంకట్
RELATED ARTICLES

