Homeతెలంగాణకల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకం కొనసాగించాలి

కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకం కొనసాగించాలి

 

గార్ల, పెన్‌పవర్, ఆగస్టు 16:

కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం గార్లలో ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపిటిసి శీలం శెట్టి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు, ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌ ఆదేశాల మేరకు ఉదయం 10:30 గంటలకు గార్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్‌ పథకాన్ని కొనసాగించాలన్న డిమాండ్‌తో నిర్వహిస్తున్నఈధర్నాకు గార్ల మండల బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్‌ మీడియా నాయకులు, మహిళా నాయకురాళ్ళు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular